సమాచార హక్కు చట్టం-2005 పట్ల పిఐఓల నిర్లక్ష్యం

సమాచార హక్కు చట్టం-2005 పట్ల పిఐఓల నిర్లక్ష్యం

సహ చట్టం గురించి పిఐఓలకు తెలుసా..? -రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్టివిస్ట్ సొసైటీ (అర్టీఐఎఎస్)-రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్

విజేత. దేవరకొండ 

సమాచార హక్కు చట్టం పట్ల పిఐఓల నిర్లక్ష్యం. సహ చట్టం గురించి పిఐఓలకు తెలుసా..? సమాచార హక్కు చట్టం పట్ల పలువురు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ (పిఐఓలు) నిర్లక్ష్యం వహిస్తూ సహ చట్టాన్ని నిరుగారుస్తున్నారు. అసలు సమాచార హక్కు చట్టం పట్ల ఏమాత్రం అవగాహన లేనివారు సైతం పిఐఓలుగా విధులు నిర్వహించడం మూలంగా వారికి సహ చట్టం అంటే ఏమిటో, సహ చట్టం కింద దరఖాస్తులకు సమాధానం ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో సమాచారం ఇవ్వాలి అనే ప్రాథమిక సమాచారం కూడా తెలియని వాళ్లు సహ చట్టం పిఐఓలు. అసలు సహ చట్టం అంటే ఏమిటి? సహ చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలు స్పష్టంగా తెలుసుకుందాం రండి.

సమాచార హక్కు చట్టం గురించి ప్రజలు తెలుసుకోండి. సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన సహ చట్టం సెక్షన్లు. సమాచార హక్కు గురించి మీకు పూర్తిగా తెలుసా..?

సమాచారం ఇవ్వకపోతే ఆ ప్రజా సమాచార అధికారి ఐపిసి సెక్షన్లు 166, 167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నేరపరిధిలోకి వస్తారు. కాబట్టి సహ చట్టం కింద దరఖాస్తు దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. లేని పక్షంలో సమాచార నిబంధనలు ఉల్లంఘించినందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర కమీషనర్లు కూడా సమాచారం ఇవ్వని వారిని జైలుకు పంపవచ్చని చట్టంలో పేర్కొనబడింది. ఒకవేళ పూర్తి అవగాహన లేకపోతే క్రింది వివరాలు చూడండి.

“సమాచార హక్కు ప్రతి దరఖాస్తుదారుడు … వినియోగదారే” 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల ఫోరమ్ వెళ్ళవచ్చు.

సమాచారాన్ని దరఖాస్తు ఫారం లేదు. కావలసిన సమాచారం తెల్లకాగితంపై రాసి పిఐఓ (ప్రజా సమాచార అధికారి) కి అడగవచ్చు. అధికారికి డైరెక్ట్ గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయినా పంపి అడగవచ్చు. దరఖాస్తు దారునికి వయస్సు, స్థానికత అవసరం లేదు.

సెక్షన్ 2 (ఎప్) ప్రకారం: సమాచార నిర్వచనం. (కార్యాలయాల్లో రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, పుస్తకాలు, ప్రకటనలు, సీడీలు, డివిడీలు, మొదలైనవి).

సెక్షన్ 2 (హెచ్) ప్రకారం: సమాచార చట్ట పరిధిలోకి వచ్చే కార్యాలయాలు (ప్రభుత్వంచే గుర్తింపు పొందిన, స్వచ్ఛంద సంస్థలు).

సెక్షన్ 2(ఐ) ప్రకారం: రికార్డు నిర్వచనం.

సెక్షన్ 2(జె) ప్రకారం: ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో రికార్డులనైనా దరఖాస్తు చేసుకుని తనిఖీ చేయవచ్చు. అవసరం అయితే జిరాక్స్ చేసుకోవచ్చు.

సెక్షన్ 2(జె)(i) ప్రకారం: పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు (ఒక గంటకు రూ. 5/-).

సెక్షన్ 3 ప్రకారం: వెల్లడించవలసిన సమాచారం ఎవరూ అడగక ముందే ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.

సెక్షన్ 4(1)(ఎ), (బి) ప్రకారం: నిర్ణయాలు వాటికి గల కారణాలు చెప్పక్కరలేదు (సమాచారం ఎందుకు అని చెప్పక్కరలేదు).

సెక్షన్ 4(2) ప్రకారం: వీలైనంత ఎక్కువగా స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారం.

సెక్షన్ 4(4) ప్రకారం: స్థానిక భాషలో ఇవ్వాలి.

సెక్షన్ 5(1), (2) ప్రకారం: ప్రజా సమాచార అధికారులు (పిఐఓ) / అప్పీలేట్ అధికారుల నియామకం.

సెక్షన్ 6(1) ప్రకారం: సమాచార హక్కు దాఖలు విధానం.

సెక్షన్ 6(2) ప్రకారం: సమాచారం ఎందుకో చెప్పనక్కర్లేదు.

సెక్షన్ 6(3) ప్రకారం: కోరిన సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ (సమాచారం మరో కార్యాలయానికి పంపవలసిన బాధ్యత అధికారులదే).సెక్షన్ 7(1) ప్రకారం: 30 రోజులలోపు సమాచారం ఇవ్వవలసిందే… వ్యక్తి జీవితానికి, స్వేచ్ఛకు సంబంధించింది అయితే 48 గంటల లోపే ఇవ్వాలి.సెక్షన్ 7(3)(బి) ప్రకారం: సమాచార రుసుము (కోర్టు సంబంధించని మాత్రం రూ. 25/-. మిగతా శాఖ వారికి రూ. 10/- మాత్రమే చెల్లించాలి). ఏ రూపంలో వేయాలి?బ్యాంకర్స్ చెక్కు రూపంలో మాత్రమే దరఖాస్తు రుసుము అకౌంట్ అధికారి పేరిట పంపించాలి.విలయసంతంత (చిరునామా) పోస్టల్ ఆర్డరు మాత్రమే రుసుముగా చెల్లించాలి. (ప్రతి పేజీకి ఎ-4, ఎ-3 రూ. 2/- చొప్పున, సీడీకి రూ. 100/- చొప్పున, ఫ్లాపీకి రూ. 50/- చొప్పున, డివిడీ రూ. 200/- చెల్లించాలి. కోర్టు లో ప్రతి పేజీకి రూ. 5/- చొప్పున చెల్లించాలి).

సెక్షన్ 7(1) ప్రకారం: దరఖాస్తు గడువు 30 రోజులు.

సెక్షన్ 7(6) ప్రకారం: గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితంగా ఇవ్వాలి.

సెక్షన్ 8(1) ప్రకారం: సమాచారం మినహాయింపులు ( దేశరక్షణ సంబంధించి ఒప్పందాలు).

సెక్షన్ 8(2) ప్రకారం: అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే మినహాయింపులు వర్తించవు.

సెక్షన్ 18(1) ప్రకారం: కమీషన్ కు ఫిర్యాదు, విదివిదనాలు

18(3)- ఫిర్యాదు విచారణ సందర్భంలో కమిషన్ల అధికారాలు

సెక్షన్ 19(1) ప్రకారం: మొదటి అప్పీలు.

సెక్షన్ 19(3) ప్రకారం: రెండవ అప్పీలు 90 రోజుల లోగా రాష్ట్ర, కేంద్ర సమాచార కమీషన్ కి అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు.

సెక్షన్ 19(1) కమీషన్ల నిర్ణయాలు: సెక్షన్ 19(8)(ఎ)(బి ) ప్రకారం దరఖాస్తుదారు తనకు కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టాలపై కమీషన్ ఆధారాలు సమర్పించాలి. సక్రమంగా ఉంటే నష్టపరిహారం మంజూరు చేయాలి.

సెక్షన్ 20(1) ప్రకారం: సమాచారం ఇవ్వకపోతే (తప్పుడు సమాచారం ఇస్తే) రోజుకు రూ. 250 చొప్పున వరకు రూ. 25,000 జరిమానా.

సెక్షన్ 20(2) ప్రకారం: క్రమశిక్షణ చర్యలకు సిఫారసు.

గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల ఫోరమ్ కు వెళ్లవచ్చు. బిసిడబ్ల్యూ తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమీషనర్ లేకుంటే డైరెక్ట్ గా న్యాయస్థానానికి వెళ్లవచ్చు. రెండవ షెడ్యూల్ లోని నిఘా భద్రతా సంస్థల్లో సెక్షన్ 24(1) అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం తీసుకోవచ్చు.ప్రతి పౌరుడు విరివిగా సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని అడగండి. సమాచారం అడగడం మన హక్కు. అడిగిన సమాచారం ఇవ్వడం అధికారుల బాధ్యత. సమాచారం ఎందుకు, ఎక్కడ, ఏమిటి అని అడిగే హక్కు అధికారులకు లేదు. సహ చట్టం సెక్షన్ 26 ప్రకారం సహా చట్టాన్ని ప్రచారంలో ప్రభుత్వం కమిషన్ల బాధ్యతలు సహ చట్టం కింద సమాచారం అడిగిన వారికి సంబంధించిన అధికారి సమాచారం ఇచ్చి తీరాల్సిందే అర్టీఐఎఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు