
విజేత,చిలకలూరిపేట : అమ్మెచ్యూర్ ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డిలో జరిగిన ఆరవ ఆరవ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లు పాల్గొన్నారు . సబ్ జూనియర్ బాలుర విభాగంలో ప్రథమ స్థానం , జూనియర్ బాలుర విభాగంలో ద్వితీయ స్థానం , జూనియర్ బాలికల విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కొల్లా రామ్ సతీష్ కుమార్, బొంత కృపారావు, వైస్ ప్రెసిడెంట్ ఈ శ్రీకాంత్ ట్రెజరర్ గురునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థులను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించి, మెడల్స్ సర్టిఫికెట్లను అందచేసి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు , డి ఆర్ ఎం ఎస్ కళాశాల పిడి పి ప్రవీణ్ , పి ఈటి నవీన్, కావ్య తదితరులు పాల్గొన్నారు.









