
అత్తాపూర్ లో మత్తు పదార్థాలే కాకుండా, ఏకంగా ప్రాణాంతకమైన ఆయుధాలు సైతం దందా.. సర్దార్ రాజా సింగ్ అరెస్ట్
విజేత,రాజేంద్రనగర్ : నగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ, మత్తు పదార్థాల దందా మరోసారి బట్టబయలైంది. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఖ్ చౌని ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. కేవలం మత్తు పదార్థాలే కాకుండా, ఏకంగా ప్రాణాంతకమైన ఆయుధాలు సైతం పట్టుబడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
అధికారులు స్వాధీనం చేసుకున్న సరుకు వివరాలు
గంజాయి: 1.5 కిలోలు
*పాపీ స్ట్రా: 1.13 కిలోలు (మత్తు తయారీకి వాడేది)
1 రివాల్వర్,2 పిస్టళ్లు గుళ్లు 5 తూటాలు. నిందితుడు సర్దార్ రాజా సింగ్ (39) అనే వ్యక్తి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు, ఉప్పూనిప్పుగా రంగంలోకి దిగి దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అతడి వద్ద ఉన్న భారీ మోతాదులో గంజాయి, పాపీ స్ట్రాతో పాటు అత్యంత ప్రమాదకరమైన తుపాకులు, బుల్లెట్లు బయటపడటంతో అధికారులు సైతం అవాక్కయ్యారు.మత్తు పదార్థాల విక్రయాల వెనుక అంతర్జాతీయ లేదా అంతర్రాష్ట్ర ముఠాల ఏవైనా హస్తం ఉందా? ఈ ఆయుధాలను ఎవరిని బెదిరించడానికి లేదా ఏయే నేరాలకు ఉపయోగించాలనుకున్నారు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. సాధారణంగా డ్రగ్స్ కేసుల్లో కనిపించే మాఫియా తీరు ఇక్కడ తుపాకులతో కలగలిసి ఉండటం నగరంలో సంచలనం సృష్టిస్తోంది.ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు, ఈ రాకెట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.









