కేడీసీసీ బ్యాంక్ ముందు తాగునీటి లీకేజీ – వృధాగా పోతున్న నీరు

విజేత,చొప్పదండి: చొప్పదండి పట్టణంలోని కేడీసీసీ బ్యాంక్ ముందు మంచినీటి పైప్ లైన్ లీకేజీతో నీరు వృధాగా రోడ్డుపైకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి పైప్ లైన్ లీకేజీ కారణంగా వేల లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు రోడ్డు పక్కన గుంటల్లో,మురికి చెత్తలో కలిసి వృధాగా పోతోంది. దీంతో ఒకవైపు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఇలా నీరు వృధా కావడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లీకేజీ నీటితో రోడ్డు అంతా బురదమయమై, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు స్పందించి లీకేజీని అరికట్టి, నీటి వృధాను నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.

Views: 1

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :