అమిత్‌ షా జన్మదిన వేడుకలు.. పేదలకు అల్పాహారం పంపిణీ

ఆర మైసమ్మ చౌరస్తాలో ఘనంగా సంబరాలు..

పాల్గొన్న బీజేపీ నాయకులు మహేష్‌ యాదవ్‌, నీరుడు శేఖర్‌ ముదిరాజ్‌

విజేత రాజేంద్రనగర్‌ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రీయ అమిత్‌ షా యువ సంఘటన ఆధ్వర్యంలో ఆర మైసమ్మ చౌరస్తాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌ నాథ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్‌ బీజేపీ అధ్యక్షుడు మహేష్‌ యాదవ్‌, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు నీరుడు శేఖర్‌ ముదిరాజ్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రత, సమగ్రతను కాపాడటంలో అమిత్‌ షా కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అమిత్‌ షా ఆయురారోగ్యాలతో ఉండి, మరిన్ని సంవత్సరాలు దేశ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకుడి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా ప్రజాసేవ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. సమాజంలోని పేదలకు అండగా నిలుస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ అమిత్‌ షా యువ సంఘటన ప్రధాన కార్యదర్శి పూనంచంద్‌, గోపి గౌడ్‌, కిస్మాత్ పూర్ మాజీ ఉప సర్పంచ్ నిరుడు శేఖర్ ముదిరాజ్, కార్పొరేటర్‌ ప్రశాంత్‌ నాయక్‌, అభినయ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :