
తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన యువ నేత వంగl రాజేశ్వర్ రెడ్డి
తొలి ఏకాదశి (పెద్ద ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు,సిద్దిపేట ప్రాంత ప్రజలకు యువ నేత వంగ రాజేశ్వర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజని,తొలకరి జల్లులతో పలకరించే వర్షాకాలం ప్రారంభానికి, వ్యవసాయ పనుల ఉత్సాహానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు.రైతన్నలు సిరులు పండించాలని, ప్రతి ఇంట్లోకి తొలకరి సిరులు రావాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.పవిత్రమైన ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలోనూ నూతన వెలుగులు నిండాలని, సిద్దిపేట గడ్డపై సర్వజనులకు మంచి జరగాలని వంగ రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.



