
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ జాగిర్ పరిధిలోని అరే మైసమ్మ ఆలయ జంక్షన్ లో అధికారులు చేపడుతున్న రోడ్ విస్తీర్ణ డివైడర్ నిర్మాణ పనులు స్థానిక ప్రజలను పాదాచారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి..ఆరే మైసమ్మ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్ డివైడర్లు సుమారు మూడు అడుగుల ఎత్తున పటిష్టంగా నిర్మిస్తుండడంతో రోడ్డు దాటడానికి పాదాచారులకు నరకప్రాయంగా మారింది.. మరియు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పాదచారుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జి (దాటుటు వంతెన) నిర్మించాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఆర మైసమ్మ దేవాలయానికి వచ్చే భక్తులు, ముసలివారు, పాఠశాల విద్యార్థులు,మహిళలు, దివ్యాంగులు,జాతీయ రహదారిని దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజల భద్రత కోసం అత్యవసరంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.






