Logo
Date of Publish : 30 July 2026, 1:30 pm
Editor : B. Anil Kumar

ఆరే మైసమ్మ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చిన మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్

విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ జాగిర్ పరిధిలోని అరే మైసమ్మ ఆలయ జంక్షన్ లో అధికారులు చేపడుతున్న రోడ్ విస్తీర్ణ డివైడర్ నిర్మాణ పనులు స్థానిక ప్రజలను పాదాచారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి..ఆరే మైసమ్మ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్ డివైడర్లు సుమారు మూడు అడుగుల ఎత్తున పటిష్టంగా నిర్మిస్తుండడంతో రోడ్డు దాటడానికి పాదాచారులకు నరకప్రాయంగా మారింది.. మరియు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పాదచారుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జి (దాటుటు వంతెన) నిర్మించాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఆర మైసమ్మ దేవాలయానికి వచ్చే భక్తులు, ముసలివారు, పాఠశాల విద్యార్థులు,మహిళలు, దివ్యాంగులు,జాతీయ రహదారిని దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజల భద్రత కోసం అత్యవసరంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

 


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )