
కార్తీక తొలి సోమవారం – రామలింగేశ్వర ఆలయంలో భక్తి పారవశ్యం
మొక్కు తీర్చుకున్న కుప్పా నారాయణ శెట్టి దంపతులు
విజేత,మంత్రాలయం : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పాత ఊరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిభావం వెల్లివిరిసింది.ఆలయం వెలుపల ఉన్న శివలింగానికి కుప్పా నారాయణ శెట్టి దంపతులు వెండి విభూతిపట్టి, కళ్ళు, మీసాలు అందించి మొక్కు తీర్చుకున్నారు. ఆలయ అర్చకుడు రుద్రయ్య స్వామికి వాటిని అందజేశారు.అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Views: 6








