
విజేత,దేవరపల్లి : విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొనిలక్ష్యా సాధన దిశగా పయనించాలని ఏలూరు ఎస్ పి డి బి టి విశ్రాంతి ప్రిన్సిపాల్ దేవరపల్లి ఆనంద్ ఎడ్యుకేషనల్ సొసైటీ గవర్నింగ్ బాడీ మెంబర్ సిహెచ్ శ్యాంబాబు అన్నారు దేవరపల్లి ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ మరియు ఒకేషనల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు జరిగిన సమావేశానికి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం విక్రమ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్యాం బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కృషి పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు గురువులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు మెట్ట ప్రాంతంలో సామాన్యులకు అసమాన విద్య అందిస్తున్న విద్యా సంస్థ ఆనంద్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్ కళాశాలని ఆయన అన్నారు కళాశాల లోని మౌలిక సదుపాయాలు. సద్వినియోగం. చేసుకొని విద్యలో మరింత ప్రతిభ చూపాలని ఆయన విద్యార్థులకు సూచించారు కళాశాల చైర్మన్ డి మేరీ కమల మాట్లాడుతూ విద్యార్థులు సంస్కారమంతమైన చదువును చదువుకుని తల్లిదండ్రులు ఆశయాలు అనుగుణంగా ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు విద్యలో ప్రణాళిక బద్ధంగా చదువుకొని జీవితంలో ముందుకు సాగాలని ఆమె సూచించారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఈఎం విక్రం మాట్లాడుతూ కళాశాలలో గత ఏడాది ఇంటర్మీడియట్ లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి వివిధ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఘనత ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాలకు దక్కుతుందని ఆయన వివరించారు విద్యార్థులు ప్రగతిని ఆయన వివరించారు విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని జీవితంలో ముందుకు ఎదగాలని ఆయన సూచించారు బీహెచ్ఎస్ఆర్ అండ్ విఎల్ఎం డిగ్రీ పిజి కళాశాల ప్రిన్సిపాల్ బీడీఎన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ క్రమశిక్షణ ఆయుధంగా చేసుకుని జీవితంలో ముందుకి సాగాలన్నారు కళాశాల ఏవో డి ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో అధ్యాపక బృందం ఎంతో కష్టపడి వివిధ అంశాలపై విద్యార్థులకు బోధించడం జరుగుతుందని విద్యార్థులు వాటి అనుసరించి విద్యలో మరింత ముందుకు సాగి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.

అలాగే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని విద్యలో ముందుకు సాగాలన్నారుఈ సందర్భంగా నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గత సంవత్సరం ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు ముఖ్య అతిథుల చేతుల మీదగా బహుమతులు అందజేసి అభినందించాడు అనంతరం ముఖ్య అతిథులు సిహెచ్ శ్యాంబాబు కృష్ణవేణి దంపతులు బి మేరీ కమలను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు అభినందన లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం విక్రమ్ అధ్యాపకులు పి రాము శ్రీనివాసరావు స్వరూప. ఉషారాణి. జ్యోతి. రజిని శ్రావణి. శైలజ అనూష. వనిత. అధ్యాపకులు అధ్యాప కేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో ఆకర్షించాయి.








