
విజేత,నల్లబెల్లి : మూడు చెక్కలపల్లికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించారు.నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామానికి చాలా సంవత్సరాల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకుండా పోయింది. దీనితో ఇబ్బంది పడుతున్న ఆయా గ్రామాల ప్రజలు పార్టీలకతీతంగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని అలాగే ఆర్టీసీ అధికారులకు కలిసి పలుమార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఎమ్మెల్యే ఆదేశాలతో నర్సంపేట ఆర్టీసీ డిఎం ఇటీవల గ్రామాన్ని సందర్శించి రోడ్డును పరిశీలించారు. అనంతరం నేటి నుండి మూడు చెక్కలపల్లి గ్రామానికి అధికారులు బస్సును పునరుద్ధరించారు దీనితో గ్రామస్తులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి అలాగే ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ సభ్యులు సపవాట్ యాకూబ్ పాల్గొన్నారు.
Views: 141








