గారపాటి దివ్య కుటుంబానికి అండగా జనసేన నాయకులు 

65,000 ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల అందజేత

విజేత,దేవరపల్లి : దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గా పోటీ చేసి విజయం సాధించి అకాల మరణం పొందిన గారపాటి దివ్య కుటుంబాన్ని శనివారం పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ విచ్చేశారు. ఈ సందర్భంగా గారపాటి దివ్య కుటుంబానికి ప్రత్యేకంగా10,000 ఆర్థిక సహాయం అందజేశారు.గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు నల్లజర్ల మండల జెడ్పీటీసీ కౌలూరి సత్తిబాబు, దేవరపల్లి మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొని దివ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు అందరూ కలిసి పార్టీ తరఫున గారపాటి దివ్య కుటుంబానికి 55,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ప్రత్యేకంగా 10,000 అందించారు. దీంతో కుటుంబానికి మొత్తం 65,000 ఆర్థిక సహాయం అందజేశారు. నల్లజర్ల మండల జనసేన నాయకులు, జనసైనికులు మండలవ్యాప్తంగా సహకారం సేకరించి రెండు బస్తాల బియ్యంతో పాటు ఇంటికి అవసరమైన నిత్యావసర సరుకులు, చిన్నపిల్లలకు కావాల్సిన దుస్తులు. మరియు ఇతర అవసరమైన వస్తువులను దివ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు దివ్య కుటుంబానికి భరోసా కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో మీరు ఒంటరివారు కాదని, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లజర్ల జడ్పిటిసి నాగ సత్యనారాయణ (కౌలూరి సత్తిబాబు) జనసేన మండల పార్టీ అధ్యక్షులు కాట్నం గణేష్. దేవరపల్లి ఎంపీటీసీ 2 ఆకుల వీర్రాజు. వీర మహిళ సెంథిల్ కుమారి.తలారి సౌజన్య.సత్య .రుద్ర శ్రీను గుడిసె శివకృష్ణ పోసి వెంకటరత్నం పల్లంట్ల పాండు అనిసెట్టి ఆదిత్య సుందరరావు .రాంబాబు  లక్ష్మణ్ తదితర జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

Views: 45

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :