గారపాటి దివ్య కు నివాళులర్పించిన  గోపాలపురం జనసేన పార్టీ ఇన్చార్జి  దొడ్డి గర్ల సువర్ణ రాజు 

విజేత,దేవరపల్లి : దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ గారపాటి దివ్య ఇటీవల అకాల మరణం పొందారు సోమవారం వారి స్వగృహం వద్ద జరిగిన పెద్దకర్మ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దివ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుమంతునిగూడెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు గుడిసె పోసి వెంకటరత్నం పల్లంట్ల పాండు అనిశెట్టి ఆదిత్య తదితర జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొని దివ్య కి ఘన నివాళులర్పించారు.దివ్య మన మధ్య లేకపోయినా, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి.

Views: 1

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :