
ఆరు గ్యారెంటీలు, 22A రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ తెలంగాణ చౌక్‌లో నిరసన
విజేత,వేములవాడ: ప్రజలకు అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, అలాగే 22A భూముల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల ప్రధాన సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, BRS ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వేములవాడ పట్టణ BRS నాయకులు ఆందోళన చేపట్టారు.వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో BRS నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.రైతులు ఎదుర్కొంటున్న 22A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అర్హులైన రైతుల భూములను 22A జాబితా నుంచి తొలగించి వారికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని BRS నాయకులు విమర్శించారు.“ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా?”“రైతుల 22A సమస్యను పరిష్కరించాలి!”“ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి!”“ప్రజల గొంతుకైన KTRను అడ్డుకోవడం ఆపాలి!”అంటూ BRS నాయకులు నినాదాలు చేశారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం BRS నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని, ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వేములవాడ పట్టణ BRS నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, kdcc బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతిర్థపు రాజు, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, వార్డు నాయకులు, తదితరులు ఉన్నారు.










