
విజేత, చిలుకూరు : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా, అసెంబ్లీ ముట్టడికి బిజెపి, పిలుపునివ్వడంతో, సోమవారం చిలుకూరు మండలంలో బిజెపి నాయకులను ముందస్తు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి కొండ, శ్రీనివాస్ గౌడ్, మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అ ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని అసెంబ్లీ వేదికగా నైనా ప్రజా సమస్యలపై బిజెపి పార్టీ, ప్రభుత్వాన్ని నిలదీస్తుందని బిజెపి నాయకులు స్పష్టం చేశారు.








