బిజెపి ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల మహేందర్ ముందస్తు అరెస్ట్

విజేత, ఇబ్రహీంపట్నం : ధర్నా చౌక్ లో విద్యార్థి మహా ధర్నా సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు ముత్యాల మహేందర్ ను ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం ఉదయం ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రూపాయలు 15000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా 40 లక్షల మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.విద్యార్థుల హక్కుల సాధనకై ధర్నా చౌక్ లో ‘విద్యార్థి మహాధర్నా’కు పిలుపునిస్తే.. భయంతో వణికిపోయి అనుమతి నిరాకరించిన ఈ పిరికి, నియంత కాంగ్రెస్ సర్కారుకు విద్యార్థుల సత్తా ఏంటో చూపిద్దాం. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తే ఊరుకునేది లేదు. విద్యార్థుల పక్షాన బిజెపి పోరాటం ఆగదు. ఈ అహంకార ప్రభుత్వ మెడలు వంచేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం కాంగ్రెస్ సర్కార్ కు ఇక తప్పదు గుణపాఠం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా తెలంగాణ విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తూ, వారి ఆశల మీద నీళ్లు చల్లుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చెక్ పెట్టవలసిన సమయం త్వరలోనే వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :