
‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’, ‘చాలా బాగుంది’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన కథానాయకుడు వడ్డే నవీన్. చాలా కాలం విరామం తర్వాత ఆయన హీరోగా, నిర్మాతగా మారి నటించిన రీ-ఎంట్రీ చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా ఆయనే నిర్వర్తించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో వడ్డే నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అయిందా? సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథా నేపథ్యం: మధ్యతరగతి కుటుంబానికి చెందిన త్రిమూర్తులు (వడ్డే నవీన్) ఒక సాదాసీదా కానిస్టేబుల్. ఎక్కడ అన్యాయం జరిగినా సహించని నిజాయితీ గల వ్యక్తి. ఆయనకున్న ఈ కరడుగట్టిన నిజాయితీ వల్లే ఏ ఊరిలోనూ మూడు నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం ఉద్యోగం చేయలేకపోతాడు. అలా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 55 సార్లు బదిలీలు అయ్యి ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’గా పేరు తెచ్చుకుంటాడు.ఈ క్రమంలో అమలాపురం నుంచి అరకు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు. ఆ పోలీస్ స్టేషన్లో గతంలో తన తండ్రి శ్రీనివాసులు (దేవి శ్రీ ప్రసాద్) పనిచేసి ఉంటారు. అక్కడ త్రిమూర్తులకు అనుకోకుండా 20 ఏళ్ల క్రితం జరిగిన ‘ప్రియమ్మ’ అనే గిరిజన అమ్మాయి అత్యాచార కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, కీలక ఫైల్ దొరుకుతాయి. ఈ కేసును దర్యాప్తు చేసే క్రమంలోనే తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడని త్రిమూర్తులకు తెలుస్తుంది.అంతేకాదు, ఆ ఘోరానికి కారకులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కమలమ్మ (శిల్పా శిలస్కర్), ఆమె కుమారుడు, కాబోయే సీఎం సంతోష్ (వివేక్ రఘువంశీ) అని త్రిమూర్తులు గుర్తిస్తాడు. ఒక సాదాసీదా కానిస్టేబుల్ అంతటి అండదండలున్న ముఖ్యమంత్రిపై ఎలా పోరాడాడు? ఆ పాత కేసును రీ-ఓపెన్ చేసి బాధితురాలికి ఎలా న్యాయం చేశాడు? అనేదే మిగతా సినిమా కథ.
విశ్లేషణ:
సుదీర్ఘ విమైనస్ పాయింట్స్: కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్.పాయింట్ బాగున్నా, కథనంలో (Screenplay) వేగం లోపించడంతో సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది.సీఎంపై జరిగే దాడి, దాన్ని హీరో అడ్డుకునే సీన్లు లాజిక్కు దూరంగా ఉన్నాయి.సినిమా చూస్తున్నంత సేపు ఇది 90ల నాటి పాతచింతకాయ పచ్చడి కథాంశం అనే భావన కలుగుతుంది.రామం తర్వాత వడ్డే నవీన్ తన రీ-ఎంట్రీ కోసం ఒక పక్కా కమర్షియల్, సోషల్ మెసేజ్ ఉన్న కథను ఎంచుకున్నారు. ప్రస్తుత పోలీస్ వ్యవస్థలోని లోపాలను, రాజకీయాల్లోని అక్రమాలను ఎత్తిచూపే ప్రయత్నం బాగుంది.
ప్లస్ పాయింట్స్: సినిమా ప్రారంభంలో వచ్చే అత్యాచారం కేసు సీన్లు ఆసక్తిని కలిగిస్తాయి.క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు రూమ్ డ్రామా, యాక్షన్ సీక్వెన్సులు పెద్ద సినిమాల స్థాయిలో రిచ్‌గా ఉండి అలరిస్తాయి.త్రిమూర్తులు ఆధారాలు సేకరించే విధానం, కోర్టులో నిందితులను బోనులో నిలబెట్టే సన్నివేశాలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్: కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్.పాయింట్ బాగున్నా, కథనంలో (Screenplay) వేగం లోపించడంతో సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది.సీఎంపై జరిగే దాడి, దాన్ని హీరో అడ్డుకునే సీన్లు లాజిక్కు దూరంగా ఉన్నాయి.సినిమా చూస్తున్నంత సేపు ఇది 90ల నాటి పాతచింతకాయ పచ్చడి కథాంశం అనే భావన కలుగుతుంది.
నటీనటుల పనితీరు: వడ్డే నవీన్ వన్ మ్యాన్ షోగా ఈ సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. త్రిమూర్తులు పాత్రలో ఆయన నటనలో ఈజ్ (Ease) ఏమాత్రం తగ్గలేదు. భవిష్యత్తులో మంచి కథలు ఎంచుకుంటే ఆయన హీరోగా నిలదొక్కుకోవడం ఖాయం అనిపించారు. సీఎం పాత్రలో శిల్ప హుందాగా నటించగా, రఘుబాబు అక్కడక్కడా నవ్వించారు. హీరోయిన్ రాశి సింగ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సాంకేతికంగా సంగీతం, ఫోటోగ్రఫీ సినిమాకు తగ్గట్టుగా సాగాయి.
ముగింపు: ఓ సాదాసీదా పాతకాలపు కథతో వడ్డే నవీన్ చేసిన ఈ కమర్షియల్ ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించలేదు. నెమ్మదైన కథనం, ఊహకందే సన్నివేశాల వల్ల ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రం అక్కడక్కడా మెప్పించినప్పటికీ, ఓవరాల్‌గా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోవడంలో విఫలమైంది.
రేటింగ్: 2 / 5






