
విజేత,తరిగొప్పుల : హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నేడు (శనివారం) జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపీయూఎస్) తరిగొప్పుల మండల ప్రధాన కార్యదర్శి తాటికొండ పెద్దన్న కోరారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్సీ, డీఏల సాధన, CPS రద్దుకు ఉపాధ్యాయులు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రకటించిన దశలవారి కార్యాచరణలో భాగంగా చివరి దశ పోరాటానికి ఉద్యోగ, ఉపాధ్యాలు, పెన్షనర్లు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.






