సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన-బీఆర్‌ఎస్‌ నాయకుల అక్రమ అరెస్టులు

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల అరెస్టులు

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం–బీఆర్‌ఎస్‌ నేతలు

అక్రమ అరెస్టు లు నిలిపివేసి వెంటనే నిలిపివేయాలని, అదుపులోకి తీసుకున్న నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జీ చల్మెడ లక్ష్మి నరసింహారావు డిమాండ్

విజేత,వేములవాడ :రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు వరుసగా అరెస్టులకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు.సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ప్రజా సమస్యలపై ప్రశ్నలు వినిపించకుండా బీఆర్‌ఎస్‌ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం, అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వారు అన్నారు.

ప్రజల తరఫున ప్రశ్నిస్తే అరెస్టులా?

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు.సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి ని ప్రశ్నిస్తున్న ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు.నేతన్నలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు అడగకుండా పోలీసు బలగాలతో బీఆర్‌ఎస్‌ నాయకులను అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు.సీఎం పర్యటనకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత..ప్రజల గొంతును నొక్కడం ప్రభుత్వ బాధ్యత కాదు.బిఆర్ఎస్ నాయకుల అరెస్టులను వెంటనే నిలిపివేయాలని, అదుపులోకి తీసుకున్న నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేసింది.ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే హక్కును ప్రభుత్వం గౌరవించాలని బీఆర్‌ఎస్‌ నేతలు స్పష్టం చేశారు.