కొత్తూరు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం… ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ దంపతులకు స్వల్ప గాయాలు.

కారు పూర్తిగా ధ్వంసం..

కోళ్లలోడుతో వెళ్తున్న డీసిఎం ఢీకొనడంతో ఘటన జరిగింది

విజేత ,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా , షాద్నగర్ నియోజకవర్గం ,కొత్తూరు సమీపంలో ,బెంగళూరు -హైదరాబాద్ జాతీయ రహదారిపై ,బుధవారం తెల్లవారుజామున ,రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ,ఆయన భార్య స్వల్పంగా గాయపడ్డారు .తిరుపతి దర్శనం ముగించుకుని , హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ,కొత్తూరు జంక్షన్ వద్ద ,కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం ,వారు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది .ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయింది.ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ,స్వల్ప గాయాలు కావడంతో బల్మూరి వెంకట్ ,దంపతులు మరో కారులో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

Views: 190

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :