విధి నిర్వహణలో ప్రతిభ చూపిన బీఎల్‌వోలకు ప్రోత్సాహక బహుమతి

విజేత,రాయికల్: రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని పోలింగ్ స్టేషన్లు నంబర్ 12, 14లకు చెందిన బీఎల్‌వోలు మాద సుజాత, అల్లే అనురాధ ఎన్నికల సంఘం చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బుధవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పద్మయ్య, గ్రామ సర్పంచ్ మీనుగు గంగు-అంజయ్యలు శాలువాలతో ఘనంగా సన్మానించి రూ.2 వేల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో అంకితభావం, సమయపాలన, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించి, అవసరమైన పత్రాలను పరిశీలించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయడం అభినందనీయమన్నారు.ఎన్నికల సంఘం చేపట్టిన కార్యక్రమాల అమలులో బీఎల్‌వోల పాత్ర కీలకమని, ఇతర బీఎల్‌వోలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని విధి నిర్వహణలో ప్రతిభ కనబరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తునికి రంజిత్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, జీపీవో దశకుమార్, కారోబార్ రమేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ts vijatha 21-07-26

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :