రైతన్నలు వడ్ల కల్లాలలో పడుకోవాల్సిన పరిస్థితి

రైతన్నలు వడ్ల కల్లాలలో పడుకోవాల్సిన పరిస్థితి

ఒకవైపు వానలు రాక, మరోవైపు పంట పెట్టుబడి లేక దిక్కు తోచని స్థితిలో రైతన్న

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైంది

రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి.

విజేత, ఇబ్రహీంపట్నం :రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టి మళ్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. పదేళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని, రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, రైతుబంధు పథకం ద్వారా 72 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామని, రైతు బీమా పథకం ద్వారా వేలాది రైతు కుటుంబాలకు భరోసా కల్పించామని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ హయంలో దేశంలోనే అత్యధికంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అమలులో స్పష్టత లేకుండా వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయకుండా అనేక నిబంధనలు పెట్టి రైతులను మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయిందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో యాసంగి, వానాకాలం పంటల ఉత్పత్తిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించామని, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందించామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో బోర్లపైన ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు వర్షాకాలం మొదలైన ఇప్పటివరకు వర్షాలు పడలేదు. రైతులకు ప్రభుత్వం గానీ అధికారులు కానీ ఏ రకమైన పంటలు వేసుకోవాలి అని సూచనలు ఇవ్వాలి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యూరియాను రైతులకు యాప్ ల ద్వారా ఇవ్వడం వల్ల యాప్లను ఉపయోగించడం రాణి రైతులు ఏరియా కోసం తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. రైతుల వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైస్ మిల్లులకు అమ్ముకోవడం ద్వారా రైస్ మిల్లర్లు, మీడియేటర్స్ లాభపడే విధంగా ప్రభుత్వ వ్యవహారం ఉంది. ఇప్పటివరకు కున్న వడ్లకు సరైన డబ్బులు కూడా ఇవ్వడం లేదు, 2021లో రేవంత్ రెడ్డి ఎంత పంట నైనా మేము కొనుగోలు చేస్తాం అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం మానుకొని, పాలనపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మొన్న ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించిన ఆరుట్ల మోడల్ స్కూల్ నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమని, ఉన్న పాఠశాల కు కొత్తగా రంగులు వేసి తామే కట్టించినట్టు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే 4సార్లు నియోజకవర్గానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలి, స్థానిక ఎమ్మెల్యే ఎన్ని నిధులు అడిగారో కూడా నిరూపించాలి. నియోజకవర్గంలోనే పెద్ద గ్రామమైన ఆరుట్లకు నిధులు కేటాయించాలని సర్పంచ్ వినతిపత్రమివ్వగా దానికి పక్కన పెట్టడం సరి కాదని, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధి పనిచేయాలని, మంత్రి పదవి ఆశతో గ్రామాల అభివృద్ధి పక్కన పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో యాచారం మండలాధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, మంచాల మండల అధ్యక్షులు చీరాల రమేష్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ముద్దు అంజిరెడ్డి, మడుపు వేణుగోపాలరావు, బహదూర్, వంగేటి లక్ష్మారెడ్డి, కృపేష్, నిట్టు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :