
గోదావరినది పుష్కరాల వేళా….ఘాట్ నిర్మాణంలో జాప్యమేలా?
విజేత ,మామడ: మండలంలోని పొన్కల్ గ్రామ గోదావరి తీరాన భక్తుల పూజలకోసం,పుష్కర స్నానాలకోసం గతంలో ఉన్న పుష్కరఘాట్ తో పాటు నాగదేవత,హనుమాన్ మందిరాలు సదర్మాట్ నిర్మాణంతో నీటమునిగిపోయాయి.ఇటీవల దిగువ భాగాన సదర్మాట్ నిర్మాణం పూర్తి కావడం జరిగింది. నాగదేవత, హనుమాన్ ఇతర ఉపాలయాల నిర్మాణం తుది దశకు చేరుకుంది.సదర్మాట్ పరిసర ప్రాంతాలలో పుష్కర ఘాట్ కోసం గత ఆరు నెలల క్రితం అధికారులు వచ్చి స్థల సేకరణ కోసం పరిశీలన చేసి వెళ్ళడం జరిగింది. కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.గోదావరి నదీ పుష్కరాలు సమీపిస్తుడంతో పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు బ్యారేజి దిగువన ఉన్న నీటిప్రవాహంలోకి దిగాలంటే చాలా ప్రమాదకరంగా వుండటంతో అది సాహసంతో కూడిన పని అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఘాట్ నిర్మాణం పనులపై ఇప్పటినుండే అధికారులు దృష్టిపెడితే పుష్కరాలలో పుణ్యస్నానం ఆచరించే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని భక్తులు,గ్రామప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






