ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

విజేత ,చిగురుమామిడి :భారత దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కారణమని,అప్పుల భారాన్ని,ధరల భారాన్ని మోడీ ప్రజలపై వేస్తున్నాడని సిపిఐ జాతీయ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.చిగురుమామిడి మండల కేంద్రంలోని, ముస్కు రాజిరెడ్డి స్మారక భవన్ లో సిపిఐ మండల కౌన్సిల్ సమావేశం తమ్మిశెట్టి రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై రోజు రోజుకు పెనుభారం మోపుతుందని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశానికి 55 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉంటే 12 సంవత్సరాలలో దానికి నాలుగింతలు పెరిగి దాదాపుగా 214 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలుగా పన్నుల భారం వేస్తుంద న్నారు,రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ధరల పెరుగుదలను చూస్తూ ఉన్నారే తప్పా చేసిందేమీ లేదని,డబుల్ ఇంజన్ సర్కార్ వస్తాదని కళలు కంటున్న బీజేపీ 12 ఏళ్లలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ చేసిందని,ఇంకా పేరుగుతాయని సంకేతాలు ఇవ్వడం సిగ్గుచేటని,మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచిందని,75రూపాయలు ఉన్న కిలో నూనె నేడు 165 రూపాయలు పెరిగిందని,కంది,పెసర,శనిగ పప్పులు,నిత్యం వంటకు ఉపయోగపడే ప్రతీ వస్తువు ధర పెంచడంతో పేదల కొనుగోలు శక్తి పడిపోయిందని అన్నారు.దేశ సంపదను అదానీ,అంబానీ లకు దోచిపెడుతుందని,పెట్టుబడి దారులకు కోట్ల రూపాయల బకాయిలు మాఫీ చేస్తూ అనేక రాయితీలు ఇస్తుందని,దేశానికి అన్నం పెట్టే రైతులకు మాత్రం రుణాలు, రాయితీలు ఇవ్వడంలేదన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి కూలీల పొట్టలు కొడుతుందని,60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రాలు ఆ పథకానికి నిధులు ఇవ్వాలని చెప్పడం దారుణమని,రాష్ట్రాల వాటా ధనాన్ని పెంచి భారం వేస్తుందని,హక్కులను హరిస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించాలని వెంకటరెడ్డి కోరారు.మండలంలో పార్టీ,ప్రజా సంఘాల నిర్మాణాన్ని బలోపేతం చేయడం కోసం శ్రేణులు పనిచేయాలని,సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి,మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి,బూడిద సదాశివ,మావురపు రాజు,తేరాల సత్యనారాయణ,ముల్కనూర్ ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్,వార్డు సభ్యురాలు రాకం అంజవ్వ ,మహిళా సమాఖ్య నాయకురాలు కయ్యం సుజాత,వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు,కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :