
విజేత, అగలి ప్రతినిధి:మడకశిర నియోజకవర్గ పరిధిలోని పుట్టపర్తిలో మంగళవారం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మెలవాయి, కదిరేపల్లి గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరి హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.







