
– విజయవాడ, గుంటూరు సహా పలు రూట్లలో పెరిగిన సర్వీసులు
– ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం జంగయ్య పిలుపు
విజేత,భద్రాచలం, ప్రతినిధి: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే భక్తులు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి పలు ప్రాంతాలకు అదనపు బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ పి. జంగయ్య తెలిపారు. ఈ సర్వీసులన్నింటికీ ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పెంచిన బస్సుల వివరాలు, వేళలు ఇలా ఉన్నాయి:
విజయవాడ మార్గం (సూపర్ లగ్జరీ):
భద్రాచలం నుంచి తెల్లవారుజామున 3:00, 4:20, 5:30 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 1:40, 2:10, 3:00 గంటలకు బయలుదేరుతాయి. అలాగే విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 7:45, 8:45, 10:00 గంటలకు, రాత్రి 7:00, 7:30, 8:00 గంటలకు బయలుదేరతాయి.
గుంటూరు మార్గం (డీలక్స్):
భద్రాచలం నుంచి ఉదయం 8:20, రాత్రి 8:00 గంటలకు బయలుదేరుతాయి. గుంటూరు నుంచి ఉదయం 8:10, సాయంత్రం 4:30 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.
అమలాపురం మార్గం (కుక్కునూరు, రాజమండ్రి మీదుగా) :
డీలక్స్ బస్సులు తెల్లవారుజామున 4:30, ఉదయం 10:30 గంటలకు, ఎక్స్‌ప్రెస్ సర్వీసు రాత్రి 9:00 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో అమలాపురం నుంచి ఎక్స్‌ప్రెస్ ఉదయం 8:15 గంటలకు, డీలక్స్ సర్వీసులు సాయంత్రం 4:30, రాత్రి 9:00 గంటలకు నడుస్తాయి.
భీమవరం మార్గం (పాల్వంచ, దమ్మపేట, చింతలపూడి, ఏలూరు మీదుగా డీలక్స్):
భద్రాచలంలో ఉదయం 6:30 గంటలకు బయలుదేరి, తిరిగి భీమవరం నుంచి మధ్యాహ్నం 1:45 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.
ఏలూరు మార్గం (కొత్తగూడెం, సత్తుపల్లి, చింతలపూడి మీదుగా డీలక్స్):
భద్రాచలం నుంచి మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు ఏలూరు నుంచి భద్రాచలానికి తిరుగు ప్రయాణమవుతుంది.భద్రాచలం, పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఈ పెంచిన బస్సు సర్వీసులను, రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని డీఎం కోరారు.









