
ఇబ్రహీంపట్నం పోలీసుల దర్యాప్తు
విజేత, ఇబ్రహీంపట్నం :రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో ఎడ్ల అనిల్ (25) అనే యువకుడు సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసి, మరింత విచారణ నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.




