
విజేత,కృష్ణ : కృష్ణ నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయాన్ని కవర్ చేయడానికి వెళ్లిన నమస్తే తెలంగాణ విలేకరిరాము ఫోటో గ్రాఫర్ తహర్ పై ఇసుక మాఫియా దాడి చేసిన ఘటన కలకలం రేపింది స్థానిక సమాచారం మేరకు రాత్రి వేళల్లో కృష్ణ నది నుండి ఇసుకను తవ్వి లారీలలో తరలిస్తున్నారు. ఈ విషయాన్ని ఫోటోలు, వీడియో తీయడానికి వెళ్లిన విలేకరిపై కొందరు వ్యక్తులు దాడి చేసి కెమెరా, సెల్ ఫోన్ ను ధ్వంసం చేశారు అక్రమ ఇసుక తరలింపును అడ్డుకుంటే చంపేస్తామని బెదిరించారు” అని బాధిత విలేకరి ఆరోపించారు సంఘటనపై బాధిత విలేకరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు అక్రమ ఇసుక తరలింపును అరికట్టడంతో పాటు విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జరుగుతున్న ఈ అక్రమాలపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.




