
విజేత,రాయికల్ : తెలంగాణ సంస్కృతివైభవానికి,భక్తి కృతజ్ఞత,సమాజ ఐక్యత, ప్రాచీనసాంప్రదాయాల వారసత్వానికి మరియు అమ్మవారిపై ప్రజల అంచలంచల

భక్తికిప్రతీక ఈ బోనాలపండగ అని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు అన్నారు.రాయికల్ పట్టణ కేంద్రంలో కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు శుక్రవారం రోజున తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థులు నిర్వహించిన ఊరేగింపు పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. స్కూల్ విద్యార్థినీలు, ఉపాధ్యాయురాళ్లుఅమ్మవారి రూపం అలంకరించుకొని భక్తితో బోనాలను తలపైనెత్తుకొని డప్పు చప్పులతో పట్టణప్రధాన వీధుల్లో ర్యాలీగా బయలుదేరి పలుకూడల్లో పోతురాజుల విన్యాసాలు,భవిష్యవాణి వినిపించే వేడుక, బాలికలువేప కొమ్మలు చేతపట్టుకుని(అమ్మవారి వేషధారణతో) మహంకాళి సాంప్రదాయ బృందనృత్యాలుచేసి పండుగ విశిష్టతను ప్రజలకు చాటి చెప్పారు. తదుపరి స్థానిక పోచమ్మ ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలను చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించు సంప్రదాయ పండుగనే ఈ బోనాల పండగ, తెలంగాణ సంస్కృతిక వైభవానికి అమ్మవారి పై భక్తులకు ఉండే అంచలంచలా భక్తికి ప్రతీక అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యం, ఆనందం,ఐశ్వర్యం,దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని మన అందరి విశ్వాసం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జూపల్లి వేణురావు, ఉపాధ్యాయ బృందం,పోషకులు,పుర ప్రముఖులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






