
విజేత, శివంపేట : శివంపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా శివంపేటలో గ్రామ సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో బాల సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2006-2007 సంవత్సరం ప్రణాళికలు భాగంగా బాలసభ నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రామ సభలో విద్యకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పాఠశాల భవనాల పరిస్థితి, తాగునీటి సౌకర్యం, బాలురు బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల సమయపాలన, వీటితోపాటు ఆరోగ్యం మరియు పోషకాహార అంశాలు. అంగన్వాడి సేవలు మధ్యాహ్న భోజనం నాణ్యత, మరియు పిల్లలకు రక్షణకు సంబంధించిన అంశాల పైన కూడా చర్చించారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, ఆటలు మరియు వినోదం, ఆట స్థలాలు ఏర్పాటు, క్రీడా సామాగ్రి, గ్రంథాలయం, సాంస్కృతి కార్యక్రమాలు పైన గ్రామ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ కార్యదర్శి రమాదేవి, శివంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు గ్రామ సభలో పాల్గొన్నారు..



