
విజేత,రాయికల్ : రాయికల్ పట్టణంతోపాటు మండల వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ పోస్టులకు 31 ఆగస్టు 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ 5 వరకు జరుగుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు సి.డి.పి. ఓ.జయప్రద తెలిపారు. రాయికల్ మండలం లో 175 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా సోమవారం వరకు రాయికల్ మున్సిపాలిటీ లోని 77 దరఖాస్తులకు గాను 17 మంది, రాయికల్ మండలం రూరల్ లో 98 దరఖాస్తులకు గాను 20 మంది దృపత్రాలను పరిశీలన మాత్రమే జరిగిందని, మిగిలిన 133 దరఖాస్తు దారుల ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని ప్రాజెక్టు సిడిపిఓ సూచించారు.








