మాణిక్యమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

విజేత, తల్లాడ ఖమ్మం బ్యూరో:  అన్నారుగూడెం గ్రామానికి చెందిన మగునూరి మాణిక్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం దశ దినకర్మ అన్నారుగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు, అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి రమేష్, అన్నారుగూడెం మాజీ విడిసి చైర్మన్ మారెళ్ళ మల్లికార్జునరావు మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, గోపాలపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ల వెంకటి హాజరై మాణిక్యమ్మ స్వగృహంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాణిక్యమ్మ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :