అక్కపల్లి లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

విజేత ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్రేషన్ కార్డులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు, పంచాయతీ సెక్రటరీ దేవేంద్ర, వార్డ్ మెంబర్లు వర్కుటి రాజు, మందాటి ఆంజనేయులు, పిట్టల లక్ష్మీ మోహన్, ముక్క లింగవ్వ ఎల్లయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు జంగా భూమి రెడ్డి, డీలర్ పునుగుంటి రమాదేవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :