
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి.
విజేత,నంద్యాల : నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ లో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ నూతన కార్యాలయం గురువారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి మరియు బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి నూతన కార్యలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మనేజర్ హరిలీల, సిబ్బంది, మాజీ మహిళా మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, ఖాతాదారులు, మహిళలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా మహిళల ఆర్థిక సాధికారత కోసం ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళల నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొంటూ ఈ సహకార బ్యాంక్ అంచెలంచెలుగా ఎదుగుతోందని పేర్కొన్నారు. మహిళలు ఈ బ్యాంక్ ద్వారా అందుతున్న ఆర్థిక సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.









