
విజేత,చొప్పదండి: చొప్పదండి మండలం పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన కరెంట్ మోటార్లు దొంగతనం చేసి వాటి నుండి రాగి వైర్లు వేరు చేసి అమ్ముకునే ముగ్గురు దొంగలను చొప్పదండి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.అరెస్టు అయిన నిందితుల వివరాలు:పంబాల నాగరాజు s/o సంచత్, 20 ఏళ్లు, యాదవ్, రా: గుండ్లపల్లి,మం: గన్నేరువరం,జిల్లా: కరీంనగర్,గువ్వ ప్రశాంత్ s/o ఉకాష్,19 ఏళ్లు, రెడ్డి, రా: పలివెడ, మం:కోహెడ, జిల్లా: సిద్దిపేట,పెనుగొండ ఎదిలైజర్ s/o వెంకటేష్, 20 ఏళ్లు, రెడ్డి,రా:గుండ్లపల్లి, మం: గన్నేరువరం, జిల్లా: కరీంనగర్ దొంగసొత్తు కొన్న వ్యక్తి కొల్చూరు అంజయ్య s/o మహదేవప్ప, 30 ఏళ్లు, గొల్ల,రా: కర్ణాటక పుస్తుతము బండ్లగూడ హైదరాబాద్,గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన పంబాల నాగరాజు, పెనుగొండ ఎదిలైజర్, కోహెడ మండలం పలివెడకు చెందిన గువ్వ ప్రశాంత్ గతంలో కూడా జల్సాలకు అలవాటు పడి డబ్బుల కొరకు కేశవవట్నం, చిగురుమామిడి మండలాల్లో పలు కరెంట్ మోటార్లు దొంగతనం చేశారని,అదే విధంగా పలుమార్లు ఉదయం పూట కాకుండా వచ్చి రెక్కి చేసి రాత్రి సమయాల్లో వేరువేరు రోజుల్లో చొప్పదండి ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ వెంట 18 కరెంట్ మోటార్లు దొంగతనం చేసి వాటిని విడగొట్టి, రాగి తీసుకొని హైదరాబాద్ బండ్గూడలోని స్క్రాప్ షాపు యజమాని అంజయ్యకు అమ్మాలని టీజీ 02 బి 1254 స్విఫ్ట్ డిజైర్ కార్లో అట్టి మోటార్ల విడిభాగాలు, రాగి వైర్లను రవాణా చేస్తున్న క్రమంలో పట్టుకున్నామని కరీంనగర్ డిఎఆర్ఎల్ ఏసీపీ విజయకుమార్ తెలిపారు.పంబాల నాగరాజుపై గతంలో హుసునాబాద్ పోలీస్ స్టేషన్లో ఒకటి, కోహెడ పోలీస్ స్టేషన్లో మూడు మోటార్లు చోరీ కేసులు నాగరాజు, ఎదిలైజర్పై గతంలో ఎల్ ఎమ్ డి పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్ కేసు ఉందని తెలిపారు.స్వాధీనం చేసుకున్న వస్తువులు ఒక స్విఫ్ట్ డిజైర్ కారు -9 కరెంట్ మోటార్లు30 కిలోల కాపర్ వైరుఇట్టి దొంగతనాన్ని ఛేదించిన చొప్పదండి ఏఎస్ఐ రాకేష్ కుమార్, కానిస్టేబుళ్లు నాగరాజు, రాజనాయక్,సుభాస్లను ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ అభినందించారు.మొదట విజేత పత్రిక 4మోటార్ల దొంగతనం ను ముందుగా ప్రచురించి తెలిపింది.ఈ సందర్బంగా ఏసీపీ విజయ్ కుమార్ మండల రైతులకు తమ మోటార్ల రక్షణకు పోలీసుల గస్తీ తో పాటు సోలార్ సీసీ కెమెరా అమర్చుకోవాలని అలాగే దొంగలు దొంగతానికి ముందు రెక్కి చేస్తారు కాబట్టి ముందు జాగ్రత్త గా తమ పొలాల దారిలో అనుమానితులను ముందుగానే గుర్తించి పోలీస్ లకు సమాచారం అoదించాలని, అలాగే ఇంటి వద్ద ఉండే వృద్ధులను టార్గెట్ చేస్తారని అటువంటి వారిని ఇంటివద్ద ఒంటరిగా ఉంచద్దని వంటి పలు సూచనలు అందించారు.









