ఆలయాల రహదారి దుర్గంధభరితం..భక్తులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే

విజేత,చొప్పదండి: చొప్పదండి పట్టణంలోని ప్రధాన ఆలయాలకు వెళ్లే రహదారి దుర్గంధభరితంగా మారడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక మాసంలో ఉదయాన్నే ఆలయాలకు వెళ్లే భక్తులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.చెరువు నుండి దుర్గంధం రావడం, రహదారి పక్కనే చెత్త చెదారాలు, కొందరు శిథిలా భవనాల వ్యర్థాలను తీసుకువచ్చి రహదారి పైనే వేయడంతో ఈ దారి గుండా నడవడం నరక ప్రయంగా, కష్టంగా మారింది. ఈ రహదారి నుండే వెళ్తే 1000 ఏండ్ల చరిత్ర గల శివాకేశవ ఆలయం, సరస్వతి ఆలయం, ఎల్లమ్మ గుడి, సమ్మక్క సారలమ్మ గుడి, పెద్దమ్మ గుడి వంటి ముఖ్య ఆలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు దర్శనానికి వెళ్తున్నారు.ఈ రహదారి ప్రక్కనే కుప్పకుప్పలుగా చెత్త చెదారాలు పడి ఉండడంతో భక్తులకు, ప్రయాణికులకు దుర్వాసన దర్శనమవుతోంది.పట్టణంలో రోడ్డుపై ఎక్కడి పడితే అక్కడ చెత్తను వేయడంతో కుళ్ళిన పదార్థాలతో చెడు వాసనలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల్లో అవగాహనా లోపం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి, అధికారులు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గ్రామం అని అవగాహనా కల్పించాలి.పట్టణంలోని ఆయా రోడ్డులపై చెత్తను వేస్తున్నా కూడా అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు.

ఇష్టానుసారంగా ఎక్కడి పడితే అక్కడ చెత్తను వేయడం, కుళ్ళిన పదార్థాలు రోడ్డుపై వేయడంతో వాసనలకు ప్రయాణికులకు దుర్వాసన చెదరగొట్టుకుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గ్రామీణం పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పరిశీలన, పరిశుభ్రత కోసం ఎన్నో నిధులను ఖర్చు చేస్తుంది. ప్రజలకు అవగాహనా కొరకు కార్యక్రమం చేయాలి. రోడ్డుపై వేసిన చెత్త చెదారాలను చూస్తుంటే ప్రజల్లో అవగాహనా కలగలేదు. అధికారులు నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారు.తీరు ఇందుకు నిదర్శనం.సమాజం పట్ల కొందరు బాధ్యత లేకుండా ఎక్కడి పడితే అక్కడ చెత్తను వేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించి దీనికి పరిష్కారం చూపాలి. దీనికి సంబంధించిన అధికారులు వ్యక్తులకు ఎక్కడి పడితే కుప్పలుగా చెత్త చెదారాలు వేయకుండా అవగాహనా కల్పించాలి. బందోబస్తు చేసి చెత్త వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఈ దారిని శుభ్రంగా ఉంచాలని ఆలయంలకు వెళ్లే భక్తుల ప్రశాంతత చెడగొట్టాద్దని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Views: 248

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :