సిరిసిల్లలో సీఎం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు..

సిరిసిల్లలో సీఎం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు..

సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి

విజేత,వేములవాడ :రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ మేరకు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వాహనదారులకు సూచనలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పట్టణ పరిధిలోని కొత్త బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌక్‌, నేతన్న చౌక్‌ మీదుగా రగుడు జంక్షన్‌ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించబోమని డీఎస్పీ తెలిపారు. వాహనదారులు పోలీసుల సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలని కోరారు.

కరీంనగర్,వేములవాడ నుంచి సిరిసిల్ల వచ్చే వాహనాలు:

రగుడు జంక్షన్‌ నుంచి రెండో బైపాస్‌ మీదుగా వెంకటాపూర్‌ నుంచి సిరిసిల్లకు చేరుకోవాలి. లేదా మొదటి బైపాస్‌ మీదుగా ఎల్లమ్మ సర్కిల్‌ నుంచి సిరిసిల్లకు రావాలి.

కరీంనగర్ వేములవాడ నుంచి ఎల్లారెడ్డిపేట, కామారెడ్డి వెళ్లే వాహనాలు:

రగుడు జంక్షన్‌ నుంచి రెండో బైపాస్‌ మీదుగా వెంకటాపూర్‌ మార్గంలో వెళ్లాలి.వేములవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు: మొదటి బైపాస్‌ మీదుగా ఎల్లమ్మ సర్కిల్‌ వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ నాగేంద్రచారి కోరారు.