
విజేత.దేవరపల్లి; దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షునిగా పదవి చేపట్టిన దేవరపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కెవికె దుర్గారావు పదవీ విరమణ అభినందన సభ కార్యక్రమం స్థానిక శివ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం మండల లోని అధికారులు ప్రజాప్రతినిధులు. మాజీ హోంమంత్రి తానేటి వనిత. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. తదితర వైసిపి నాయకులు. ప్రజాప్రతినిధులు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ నాగార్జున్ రావు. డిప్యూటీ ఎంపీడీవో బి. రాజారావు. కార్యాలయ సూపర్డెంట్ శాంతి. సిబ్బంది పాల్గొని కెవికె దుర్గారావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కేవీకే దుర్గారావు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు దేవరపల్లి మండలంలో చేసిన అభివృద్ధి పనులు సంతృప్తినిచ్చిందని. దీనికి సహకరించిన అధికారులు.

ప్రజా ప్రతినిధులు. నాయకులు. గ్రామాల్లో కార్యకర్తలు కృషి సహకారం అభినందనీయమైన అన్నారు. పార్టీలకు అతీతంగా నాకు తోడ్పాటు అందించిన దేవరపల్లి మండలంలోని ప్రజలకు ప్రజాప్రతినిధులకు. అధికారులకు అభినందనలు తెలియజేశారు. పార్టీలు కు అతీతంగా పనిచేసి అభివృద్ధి చేశానని. మండలంలోని ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని. నా రాజకీయ జీవితం ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గంలోని వైసిపి ప్రజాప్రతినిధులు నాయకులు. కార్యకర్తలు. వివిధ శాఖలకు చెందిన అధికారులు. సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.









