
విజేత, తరిగొప్పుల : కలెక్టర్ ఆదేశాల మేరకు తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లపై మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీఓ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 2:00 గంటలకు వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్ దీపాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాల మేరకు సూచనలు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి తరిగొప్పుల మండల స్థాయికి చెందిన అధికారులు తహసీల్దార్ ,పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ,ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ,ఏఈ పంచాయతీ రాజ్ ,ఏఈ నీటి సరఫరా శాఖ ,ఏఈ ఇరిగేషన్ (సాగునీటి శాఖ) ఎంపీవో వైద్య ఆరోగ్య శాఖ, అలాగే అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ,ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొనాలని ప్రకటనలో పేర్కొన్నారు.








