శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుక

– విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

విజేత,హనుమకొండ ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సుబేదారి ఎస్సై కె.సతీష్, పాఠశాల ఏజీఎం మనోహర్‌ పిలుపునిచ్చారు. హనుమకొండలోని శ్రీ చైతన్య సీబీఎస్‌ఈ పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెరిమనీ (ప్రమాణ స్వీకారోత్సవం) మంగళవారం ఘనంగా జరిగింది.పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్, సీసీఏ కెప్టెన్, హౌస్ కెప్టెన్లు, డిప్యూటీ కెప్టెన్లుగా ఎన్నికైన విద్యార్థులకు ముఖ్య అతిథులు బ్యాడ్జీలు తొడిగి బాధ్యతలు అప్పగించారు. అనంతరం విద్యార్థి నాయకులు పాఠశాల నియమ నిబంధనలకు కట్టుబడి, తోటి విద్యార్థులకు ఆదర్శంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిలు మాట్లాడుతూ.. నాయకత్వం అంటే అధికారం కాదని, తోటి వారికి సేవ చేస్తూ బాధ్యతా యుతంగా వ్యవహరించడమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్యా, డీజీఎం చైతన్య, ఏజీఎమ్ మనోహర్, ప్రిన్సిపల్ లక్ష్మి, కోఆర్డినేటర్ శివకోటేశ్వర్, డీన్ కర్ణాకర్, జోనల్ పీఈటీ ప్రవీణ్, ఇన్‌ఛార్జ్‌లు షాహీన్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :