
వెంబడించి పట్టుకున్న గ్రామస్థులు
అన్నపురెడ్డిపల్లి ఠాణాలో అప్పగింత
విజేత,ములకలపల్లి :ములకలపల్లి,మండల పరిధిలోని చాపరాలపల్లి రామాలయంలో హుండీ చోరీ యత్నం కలకలం రేపింది. ఆలయంలోని హుండీని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, ఆటోలో తరలించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై వారిని వెంబడించారు. పెంట్లం సమీపంలో నిందితులను పట్టుకుని అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులకు అప్పగించారు.ఎస్సై నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఖమ్మం ప్రాంతానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.









