అధికార దండన..అక్రమ వెంచర్ దందా​అనుమతులు నిల్.. వసూళ్లు ఫుల్

గంధంగూడలో రియల్ మాయాజాలం ప్రభుత్వ భూమిపై కన్ను, ప్లాట్ల పేరిట కోట్లు లూటీ

ప్రజాప్రతినిధి అండ.. అధికారులు నిమ్మకు నీరెత్తిన వైఖరి

విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ సర్వే నంబర్ 38లో దందా: గంధంగూడ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 38 లో 3 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో ఎలాంటి ప్రభుత్వ, లేఅవుట్ అనుమతులు లేకుండానే అక్రమంగా లేఅవుట్ ఏరియాలు ఏర్పాటు చేశారు.​ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయంటూ నమ్మబలికి, గజం రూ.75 వేల చొప్పున విక్రయిస్తూ అమాయక కొనుగోలుదారుల నుండి కోట్లాది రూపాయలు గుంజుతున్నారు.

​ప్రభుత్వ ఆదాయానికి గండి.

ఎలాంటి పన్నులు, రుసుములు చెల్లించకుండా భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

రాజకీయ అండదండలు.

అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతోందని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోమంటే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ హెచ్చరిక.

ఈ వెంచర్లకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :