
నంది కామన్ హాస్టల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకట కృష్ణ
విజేత,వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ నంది కామన్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ హాస్టల్ లో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 10 వ తరగతి విద్యార్థులు మన్విత్ మిత్ర బృందం ఉట్టి కొట్టి ఆనందోత్సవాల మధ్య వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్నారు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీకృష్ణుని జీవిత విశేషాలు, ఆయన బోధించిన విలువలను తెలియజేస్తూ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకట కృష్ణ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని జీవితం ద్వారా ప్రేమ, ధర్మం, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను విద్యార్థులు అలవరచుకోవాలని సూచించారు హాస్టల్ సుప్రవైజర్ వార్డెన్లు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కృష్ణాష్టమి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి అని తెలిపారు.









