జలయజ్ఞ ప్రదాత వైయస్ రాజశేఖర్ రెడ్డి.

వైయస్ఆర్ సేవలు మరువలేనివి.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్.

ఎల్లారెడ్డిపేటలో ఘనంగా వైఎస్ఎస్ జయంతి వేడుకలు.

పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

 

విజేత,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూడిది రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్ కే సాబేరాబేగం లు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక దార్శనీకుడని అన్నారు.ఆయన చేసిన సేవలలో ఆరోగ్యశ్రీ,ఫీజు రియంబర్స్మెంట్,ఇందిరమ్మ ఇండ్లు, జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు కట్టి రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు వైయస్సార్ సేవలు మరువలేనివి అన్నారు. రైతులకు ఎనలేని సేవలు చేసి చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అపర భగీరథుడని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,రాజన్నపేట సర్పంచ్ కల్లూరు బాపురెడ్డి,అగ్రహారం మామిళ్ల కిషన్, అల్మాస్ పూర్ సర్పంచ్ నాగేల్లి వెంకటరెడ్డి, హరిదాస్ నగర్ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్,జిల్లా నాయకులు ఎస్కే సాహెబ్ , కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,చెన్ని బాబు,గంట బుచ్చగౌడ్,అనవేని రవి, లక్ష్మారెడ్డి,కొండాపురం శ్రీనివాస్ రెడ్డి,గొల్లపల్లి మల్లేశం, మేడిపల్లి దేవానందం,నంది కిషన్,బండారి బాల్ రెడ్డి,తేజ శ్రీనివాస్,గుర్రాల రాజిరెడ్డి,రఫీక్,గంట అంజయ్య, రాజ్ కుమార్,చంద్రారెడ్డి, ఇలియాస్, వంగ శ్రీకాంత్ రెడ్డి సత్యనారాయణ,శ్రీపాల్ రెడ్డి, భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :