కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ‘బాకీ కార్డు’ కార్యక్రమం

విజేత,పెద్ద శంకరంపేట్: పెద్ద శంకరంపేట్ పట్టణంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించిన బీఆర్‌ఎస్‌ నాయకులు శంకరంపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు’ కార్యక్రమాన్ని బుధవారం శంకరంపేట పట్టణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’లను అందజేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షన్‌దారులు, వికలాంగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలుపై తమ పార్టీ తరఫున వివరించారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. వివిధ వర్గాలకు ప్రభుత్వం బాకీ పడిన హామీలు, సమస్యలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు.కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :