పార్టీ క్రమశిక్షణే ముఖ్యం.. వెంకటాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంప రాంబాబు..

విజేత,వెంకటాపురం: భారత్ రాష్ట్ర సమితి ( అధినేత, గులాబీ బాస్ కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) (కేటీర్ ) సూచించిన బి ఆర్ ఎస్ సమారాబేరి కార్యక్రమం సెప్టెంబర్ 2నుండి వారం రోజుల పాటు మండలం లో జరిగే కార్యక్రమం లో ప్రతి బి ఆర్ ఎస్ సైనికులు పాల్గొని వెంకటాపురం మండల పార్టీని బలోపేతం చేస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని బి ఆర్ సీ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు తెలిపారు.ఈ సందర్భంగా గొడవర్తి నర్సింహామూర్తి మాట్లాడుతూ… 1000రోజుల కాంగ్రెస్ పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ లు 420హామీలు ప్రజలకి ఇచ్చి పచ్చి మోసం చేశారాని రైతులకు మహిళలకు వృద్దులకు వికలాంగులకు విద్యార్థులకు నిరుద్యోగుకులకు రైతు కూలీలకు ఇచ్చిన హామీలు వెంటనే పార్షికరం చేయాలనీ లేని ఏడలా ప్రజల మద్దతుతో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న దశల వారీగా ఉద్యమాలు చేస్తామని ఏ సందర్బంగా బి ఆర్ ఎస్ మండల ఆధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ సమరబెరీ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు పార్టీ కి సంబందించిన ప్రజాప్రతినిధులు మండలం లోని అన్ని వర్గాలకు సంబందించిన ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజవంతం చేయాలనీ పిలుపునివ్వడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :