ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి

*ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి*

ఎస్సై బానోత్ వెంకన్న

విజేత,నర్సింహులపేట :

మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సోమవారం రోజున స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భానోత్ వెంకన్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, సూచించారు. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలైన గంజాయి, నల్ల మందు హెరాయిన్, మార్ఫిన్, బెంజిడ్రిన్, కోకెయిన్, పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల, కలిగే పర్యావసనాలను వివరించారు, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగం వల్ల శరీరం పైన అమితమైన ప్రభావం చూపిస్తుందని, కేంద్ర నాడీ మండలం పైన నేరుగా ప్రభావం చూపి మగత ఉండేలా చేస్తాయని, మత్తు మందుల వాడకని అలవాటు పడ్డ విద్యార్థులలో ఎక్కువగా మోసం చేయటం అబద్దాలాడటం దొంగతనాలు చేయడం హింసాత్మక సంఘటనలు హత్యలకు పాల్పడటం, దొంగ రవాణాలు చేయుటం, వీరిలో నైతిక విలువలు తగ్గుముఖం పడతాయని విపరీతమైన ప్రవర్తన, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయని, శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ అని వీటి వినియోగం వలన జ్ఞాపకశక్తి కోల్పోవడం, కాలేయం దెబ్బతినడం, భ్రమలకు బ్రాంతులకు లోను కావడం జరుగుతుందని తెలిపారు. కావున విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల మరియు కాలేజీ ప్రిన్సిపల్ నర్సిరెడ్డి, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది జోగేంద్ర సింగ్, అజిత్,మమత, ఉషశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :