స్కూటీ సెల్ఫ్ స్కిడ్.. సాయం చేసేందుకు ఆగిన కారుకు మరో కారు ఢీ – ఇద్దరికి గాయాలు

విజేత,మామడ: మామడ–దిమ్మదుర్తి గ్రామాల మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, నిర్మల్ మండలం (కౌట్ల. కె) గ్రామానికి చెందిన వీరేష్ (50) స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి సెల్ఫ్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోయాడు. అతడిని కాపాడేందుకు ఓ కారులో వెళ్తున్న వ్యక్తి వాహనాన్ని ఆపి సహాయం చేసేందుకు దిగాడు.ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వీరేష్‌కు మోకాలికి గాయాలు కాగా, కారులో ఉన్న వాస్తాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం గంగారాం (65)కు కూడా తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :