
షాబాద్ లో ఎం డి ఎం ఏ డ్రగ్స్ పట్టివేత ఇద్దరు నిందితుల అరెస్ట్ 13.97 గ్రాముల ఎం డి ఎం ఏ స్వాధీనం
విజేత, రంగారెడ్డి : చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం నాగర్ కుంట చౌరస్తాలో 9- 10-2026 ఫ్యూచర్ సిటీ, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఐపీఎస్ ఆదేశాల మేరకు డిసిపి చేవెళ్ల యోగేష్ గౌతమ్, ఐపీఎస్ పర్యవేక్షణలో అదనపు డిసిపి ఫ్యూచర్ సిటీ జహంగీర్,మార్గదర్శకత్వంలో చేవెళ్ల జోన్, ఎస్వోటీ, మరియు షాబాద్ పోలీసుల, సంయుక్త బృందం నిర్వహించిన రహస్య ఆపరేషన్ లో ఇద్దరు వ్యక్తులను, అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13.17 గ్రాముల ఎం,డి,ఎం,ఏ మాదకద్రవ్యాన్ని, మూడు మొబైల్ ఫోన్లను, స్వాధీనం చేసుకున్నారు.కేసు వివరాలు తేదీ 9- 10- 20 26 షాబాద్ పోలీసులకు, అందిన విశ్వసనీయ సమాచారం మేరకు షాబాద్ లోని నాగర్ కుంట, చౌరస్తా సమీపంలో టీ టైం వద్ద,ఎం,డి,ఎం,ఏ మాదకద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి పట్టుకోవడానికి రహస్య ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో చేవెళ్ల జోన్ ఎస్,ఓ,టి బృందం, మరియు షాబాద్ పోలీస్ సిబ్బంది, సమన్వయంతో వ్యవహరించారు.క్లూస్ టీం సహకారంతో పంచుల సమక్షంలో తనిఖీలు నిర్వహించి,ఫోటోగ్రఫీ, మరియు వీడియోగ్రఫీ, ద్వారా సంబంధిత ప్రక్రియను నమోదు చేశారు. ఈ సందర్భంగా పట్టుబడిన నిందితులు 1,మారమ్ వంశి రెడ్డి,వయసు 23, సంవత్సరాలు నివాసం ఇంద్ర రెడ్డి నగర్ కాలనీ మీర్జాగూడ 2, బీరా ప్రవీణ్ కుమార్,వయసు 28, సంవత్సరాలు నివాసం ఇంద్రారెడ్డి నగర్, కాలనీ మీర్జాగూడ,శంకర్ పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, స్వాధీనం చేసుకున్న వస్తువులు 1, ఎం,డి,ఎం,ఏ మాదకద్రవ్యం, నికర బరువు 13.97 గ్రాములు 2, రెడ్మీ మొబైల్స్- 23, కిచెడా బ్రాండ్ కీప్యాడ్ మొబైల్ ఫోన్ -1 స్వాధీనం చేసుకున్న ఎం,డి,ఎం,ఏ మాదకద్రవ్యం విలువ సుమారు రూ 2,00.000 గా అంచనా వేయబడింది.నిందితుల వివరాలు ప్రాథమిక విచారణలో నిందితుల బెంగుళూరులోని స్టీఫెన్, అనే వ్యక్తి వద్ద నుంచి గ్రాము కు రూ 3,000 చొప్పున సుమారు 14, గ్రాముల ఎం,డి,ఎం,ఏ ను 42, 000 కు కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.హైదరాబాదులోని మోకిలా, కోకాపేట్,నానక్ రామ్ గూడ,ప్రాంతాల్లోని విద్యార్థులు, మరియు సాఫ్ట్ వేర్, ఉద్యోగులకు విక్రయించి,అక్రమంగా డబ్బు సంపాదించాలనే,ఉద్దేశంతో ఈ మాదకద్రవ్యాన్ని తీసుకువస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో స్టీఫెన్,అనే మరో వ్యక్తి పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది.అతని ఆచూకీ గుర్తించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు వివరాలు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యం మరియు మూడు మొబైల్ ఫోన్ లను, పంచనామా ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్,డి,పి,ఎస్ యాక్ట్ 1985 లోని సెక్షన్ 8 (c )రెడ్ విత్ 22 (c) ప్రకారం కేసు నమోదు చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట్టారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలపై పోలీసులు నిరంతరం నిగా కూడా సాగిస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినవారు.పోలీసులకు తెలియజేయాలని, కోరుతున్నారు. సమాచారం అందితే వారి వివరాలను గోప్యంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటారు.








