మంత్రాలయంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

– పటిష్ట బందోబస్తు – ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి

విజేత,మంత్రాలయం: రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రాలయం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం పరిశీలించారు.నామినేషన్ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్థానిక పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఎస్పీ వెంట ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు గిరిబాబు, రామకృష్ణ,.. ఎస్ఐ. లు.. విజయ్ కుమార్. మల్లికార్జున ఉన్నారు…..

Views: 1

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :